ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్ 27, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇద్దరు

ఆనాటి కర్ణ దుర్యోధనుల నుంచి ఈ నాటి బరాక్ ఒబామా జో బైడెన్‌ల దాకా మనుషలని నడిపే హెమోగ్లోబిన్ రహిత పవిత్ర పటుత్వ ఫెవికాల్ బంధం స్నేహం. అమ్మా నాన్నలకి తప్పదు, కన్నారు కాబట్టి. అన్నదమ్ములకి, అప్పచెల్లెళ్లకి తప్పదు కలిసిబుట్టారు కాబట్టి. చిటికెలో తెంచుకోగలిగి, తుంచుకోక ఎన్నో తుఫానులు తట్టుకు నిలబడే అజరామర బంధం, స్నేహం. నేను కాలేజీకి వెళ్లడం మొదలెట్టి ఒక నెల రోజులయ్యాక ముందు వరస మూల సీటులో మూలా నక్షత్రంలో పుట్టిన మలప త్రాష్టుడొకడు మోటు బఱ్ఱె గొంతేసుకుని ఓండ్ర పెడుతూ కనిపించాడు. ఎవడ్రా ఈ జఫ్ఫాగాడు మనిషి చూస్తే బ్రాడ్ పిట్లా ఉన్నాడు స్వరం వింటే వేలంపాట వరహాల రావులా ఉంది అనుకున్నా. సర్లే వీడితో మనకేమి పని ముందు బెంచి మాంగోమాన్ గాడు మనలాంటి బ్యాక్ బెంచ్ బాట్‌మాన్‌తో ఏమి పనిలే అని మిన్నకున్నాను. మా ఇంటికి సగం దూరం వరకు సైకిల్ తొక్కే సింగినాధం గాడు ఒకడు పరిచయం అయ్యాడు వాడి పేరు రిజిష్టరుడు. వాడి గురించి వాడి పేరు గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. దానికి ఇంకొక బ్లాగు కావాలి. నాకు చాలా ఓపిక కావాలి. ప్రస్తుతం సమయం, సహనం రిజర్వు లో నడుస్తున్నాయి గనుక ఇవాళ్టికి మా మూలా నక్షత్రం గాడి గురించి మాట్లాడుక...

ఆరాధన

  కన్నీళ్లు కళ్ళకి మంచివి. కడిగేస్తాయి. కళ్ళని, మనసులోని బాధల్ని. గీతా ప్రకాష్, జెస్సి కార్తిక్, గీతా రాజా రేంజ్ ప్రేమ కథ ఒకటి చెప్పాలని నా కోరిక. అంత తెలివి, క్రియేటివిటీ నాకు లేవు గనుక మా అమ్మా నాన్నల ప్రేమ కథ చెబుతాను వినండి. మణిరత్నం గీతాంజలి, శేఖర్ కమ్ముల ఫిదాలా ఉండే స్టోరీ కాదు కానీ చాలా రొటీన్ కథ. పెళ్లిళ్ల పేరయ్య , అటు పెద్ద వాళ్ళు , ఇటు పెద్ద వాళ్ళు , మావిడాకులు, కొబ్బరి కాయలు, తాటాకు పందిళ్లు, విడిదిల్లు, పెళ్లి బస్సులు, చిన్న కార్లు, పూల దండలు, పన్నీరు బుడ్డీలు, షామియానాలు, పెట్రో మాక్స్ లైట్ల కింద అరిటాకు భోజనాలు. హబుల్ టెలీస్కోప్ వేసి వెతికినా కనిపించిన అనుష్కా శెట్టి నక్షత్రం. పెళ్ళిలో వాళ్ళిద్దరి మధ్య తీసిన తెరసాల, వాళ్ళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ మొదటి చూపులో ప్రేమ దిన దిన ప్రవర్ధమానమై నాకు తలుచుకోవడానికి బోలెడు జ్ఞాపకాలు ఇచ్చింది. అమ్మంటే నాన్నకు ప్రాణం, నాన్నే అమ్మ లోకం. అసలు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని ఎలా చూపిస్తారు ? ఒక తడి ముద్దు, ఒక వెచ్చని కౌగిలి పోనీ ఓ ఖరీదైన కానుక ? నాకు మా అమ్మ ప్రేమ, నాన్నకు ఇచ్చిన కాఫీలో, అది తన్మయత్వంతో తాగుతుంటే తన ముసి ముసి నవ్వులలో, నాన...