శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర శ్రీ తిట్లర్ గారికి, చిరునామా: పూణే తపాళా తపాలా కార్యాలయం, ( ఉత్తరం ఆయనకు సమయానికి జేరకపోతే మీ కార్యాలయం లయమే ) పిన్ను కోడు: 1302 ------------------------------------ cut here ---------------------------------- పూజ్య గురుదేవులు, గురుపత్ని పాదపద్మములకు నమస్సుమాంజలి, ఉభయకుశలోపరి. పాతికేళ్ళు, ఈ పాతికేళ్లలో మీరు ఎన్ని చూసి ఉంటారో నేను చెప్పడం, మీకు పెద్ద బాల శిక్ష బహుకరించడమంత వెటకారంగా ఉంటుంది. అర్హత అన్న మాట అసలు వాడరానిది, వయసు చిన్నది, మీరిరువురూ కలకాలం కూత, లైకుల్లాగా. వేవేల రీట్వీట్లు అనుభవించాలన్న కోర్కె మాత్రం చాలా ఘాట్టిది. చిరుబుర్రులు చిరుగాలిలా, చిరునవ్వులు జడివానలా కురవాలని, చిరంతనమైన మీ ప్రేమ చిరంజీవి కావాలని, చంద్రకళలు అసలు లేకుండా, ప్రతి రేయి ఈ చంద్రుడికి అరుణోదయం కావాలని, చంద్రశేఖరుడికి, చంద్రకాంతా దేవికి రజతోత్సవ శుభాకాంక్షలు. ...